ఇంటింటికి సిపిఎం పార్టీ చిట్వేలి లో ప్రారంభం.
---ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న సిపిఎం పార్టీ నాయకులు.
అన్నమయ్య జిల్లా చిట్వేలి లో ఇంటింటికి జనం కోసం సిపిఎం పార్టీ అనే కార్యక్రమాన్ని మంగళవారం సిపిఎం డివిజన్ నాయకులు ఓబిలి పెంచలయ్య నాయకత్వంలో ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఓబిలి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు జగనన్న కాలనీకి ఒక్క సెంటు ఇంటి స్థలం చాలా మంది పేద వారికి దక్కలేన్నారు. ఇక వృద్ధాప్య పెన్షన్లు విషయానికి వస్తే వాళ్లకు వయస్సు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు లో వయసు సంఖ్య తప్పిదం వల్ల పేదలకు వృద్ధాప్య పెన్షన్లు అందడం లేదన్నారు.వృద్ధాప్య పింఛన్లు, విడో పెన్షన్, అమ్మ ఒడి, రైతు భరోసా, మా అకౌంట్లో పడలేదని కొందరు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకు వచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని కరెంట్ బిల్లు, పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజల పై భారం మోపుతున్నాయని అలాగే ఇంటి పన్ను, చెత్త పన్ను, బస్ చార్జీలు విపరీతంగా పెరిగాయని పనులు లేక ఆదాయం లేక సంక్షేమ పథకాలు అందక ప్రజలు సంతోషంగా లేరన్నారు.ఈ సమస్యలన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకు పోయి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రజల వెంటే ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కొత్త నాని, కె.వి పి ఎస్ నాయకులు మల్లారపు కిష్టయ్య,ఆర్ బాబు, పి పెంచలయ్య,పి రాజశేఖర్ , లక్ష్మి నారాయణ, పరిపూర్ణ చారి,సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments