సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్
ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు సోమవారం నాడు భేటీ అయ్యాయి. సీపీఎస్ విధానంపై చర్చించాయి. CPS విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. సీపీఎస్ రద్దు విషయమై ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు చర్చలు జరిపింది.ఈ చర్చలు ముగిసిన తర్వాత ఏపీ ఎన్టీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ను ప్రవేశ పెడతామని ఆంధ్రా సర్కార్ ప్రతిపాదించింది. ఈ పెన్షన్ స్కీమ్ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించారు. సీపీఎస్ ను రద్దు చేయాలని కోరారు.
గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రతిపాదించింది.ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. , ఉద్యోగుల నుండి కాంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ స్కీమ్ లేకుండా ఉద్యోగులు కోరారు. . జీపీఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని చెప్పారు. ఉద్యోగ సంఘాలు పలు సమస్యలను ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చామని బండి శ్రీనివాసరావు చెప్పారు. మరో వైపు పీఆర్సీ అంశానికి సంబంధించి ఇచ్చిన హమీల మేరకు జీవోలను జారీ చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. రెండు మూడు రోజుల్లో మంత్రుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హమీ ఇచ్చారన్నారు.
تعليقات