డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన సి డబ్ల్యూ సి ప్రెసిడెంట్ ఎం జయరాజు.
ఏప్రిల్ 14 వ తేదీన భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా అగనంపూడి సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో పినమడక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో క్రికెట్ పోటీలను ఎం జయరాజు ప్రారంభించారు. అనంతరం క్రికెట్ షీల్డ్ ల ను ఆవిష్కరించారు.
ఎం జయరాజు మాట్లాడుతూ క్రికెట్ పోటీల వల్ల యువతలో ఉన్న సృజనాత్మకమైన ప్రావీణ్యతను, ప్రభావితం చేయడం ఎంతో దోహదపడుతుందని అన్నారు. మానసిక ఉల్లాసానికి, శరీర ఆరోగ్యానికి ఆటల పోటీలు ఎంతో ఉపయోగం అని అన్నారు.
సీనియర్ కార్మిక నాయకుడు బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అగనంపూడి సిడబ్ల్యూసి అందరినీ కలుపుకొని ఇటీవల పదవీ విరమణ చేసిన వారికి సన్మానం, వ కాలనీ ప్రయాణికులు భవన కార్మికులు ఇబ్బంది పడకుండా చలివేంద్రం, యూత్ ప్రోత్సహించడానికి క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. యువతని ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలకు సహకరించిన పినమడక జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం ఎం వెంకటరావుకి ధన్యవాదాలు తెలిపారు.
సిడబ్ల్యూసి కార్యదర్శి వంకర రాము మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ క్రికెట్ పోటీలు అగనంపూడి పరిసర ప్రాంతాల నుండి 30 టీములు పాల్గొనడం జరిగింది అని 9 ,10 తేదీల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ఫస్ట్, సెకండ్, తరుడు విజేతలకు షీల్డ్ ,నగదు బహుమతులు ఏప్రిల్ 14 వ తేదీన సీడబ్ల్యూసీలో ప్రముఖుల చేతుల మీదగా ఆంద చేయబడును అన్నారు,
సిడబ్ల్యూసి ప్రతినిధి శీరంశెట్టి శ్రీనివాసరావు సభదక్షతన జరిగిన కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు పెదిరెడ్ల నీలకంఠం, ఉప్పల కన్నారావు, వురిటి మరిడయి , చిత్త అబ్బాయి, పట్టా రమేష్, ఏ ఐ టి సి యూనియన్ నాయకులు అలమండ శ్రీనివాసరావు, అగనంపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ బంధం అప్పలరాజు స్థానిక నాయకులు దయాకర్ ,కే సింహాద్రి, అండబోయిన మంగరాజు, గోవిందా అట్టా అప్పారావు క్రికెట్ ఆటగాళ్లు పాల్గొన్నారు.
Comentários