వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు లో రాయలసీమ స్థాయి హార్డ్ టెన్నిస్ హై బౌలింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో వైఎస్సార్సిపి ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులు ఏర్పాటు చేసిన రాయలసీమ స్థాయి క్రికెట్ పోటీలకు, రాయలసీమ జిల్లాలలో సుమారు వంద క్రికెట్ టీములు పాల్గొననున్నాయి, కాగా క్రికెట్ పోటీలలో పాల్గొనే యువతకు ఉత్సాహపరచుటకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు చదువుతో పాటు క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, అందునా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రీడ పట్ల యువతకు ఆసక్తి మక్కువ ఎక్కువని, భారతదేశంలోని నలుమూలలా యువత క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతారని, క్రీడా పరంగా క్రికెట్ వలన యువతకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని తెలిపారు.
వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా లక్ష రూపాయల నగదు, రెండవ బహుమతిగా యాబై వేళా రూపాయలు, మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు, నాల్గవ బహుమతిగా పది వేల రూపాయలు. మ్యాచ్ నందు హ్యాట్రిక్ సిక్సులు కొట్టిన క్రీడాకారుడికి రెండు వేల రూపాయల క్యాష్ అవార్డ్, అలాగే హ్యాట్రిక్ వికెట్లు తీసిన క్రీడాకారుడికి పది వేల రూపాయల కాష్ అవార్డు ఇవ్వనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు (వై.ఎస్.ఆర్ యూత్) తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, మూడవ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆనంద రావు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులు, కార్యకర్తలు క్రికెట్ క్రీడా అభిమానులు పాల్గొన్నారు.
Comments