చిట్వేలి-కోడూరు రోడ్డు
రైల్వే కోడూరు చరిత్రలో ఒక మైలు రాయి.
---ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిట్వేలి కోడూరు రహదారి విస్తరణ రైల్వే కోడూరు చరిత్రలో మరిచిపోని ఒక మైలురాయి అని ప్రభుత్వ విప్,శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.
గురువారం ఉదయం 45 కోట్ల నిధులతో నాగవరం వద్ద భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. రహదారి విస్తరణ చేపట్టిన ఘనత మా వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందే రోడ్డు పనులు పూర్తిచేసి మాట నిలబెట్టుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ,వైసిపి నాయకులు ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి,డైరెక్టర్లు మలిశెట్టి వెంకటరమణ, ముజీబ్, రైల్వే కోడూరు ఉపసర్పంచ్ తోట శివ సాయి,జిల్లా కోఆప్షన్స్ సభ్యులు అన్వర్ భాష,జడ్పిటిసి రత్నమ్మ,ఆర్ అండ్ బి ఈ ఈ ఈ సహదేవరెడ్డి, విక్రమ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments