చిట్వేలి ఉపాధ్యాయులకు గురు స్పందన అవార్డులు
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు గురు స్పందన అవార్డులు ఇచ్చి సత్కరించారు. అనంతపురం నగరంలోని కే ఎన్ ఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ ఉపాధ్యాయులను దుస్చాలవా, మొమెంటో, ధ్రువ పత్రం ఇచ్చి సత్కరించి నట్లు సోమవారం తెలిపారు. సన్మానం పొందిన వారిలో చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లోపాధ్యాయులుగా మరియు ఎన్సిసి అధికారిగా పనిచేస్తున్న పసుపుల రాజశేఖర్, ఆంగ్లోపాధ్యాయునిరాలు శ్రీకాంతి, చిట్వేలి కేజీబీవీ ఆంగ్లోపాధ్యాయునీరాలు హేమలత ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ఆత్మహత్యల నివారణ వంటి వివిధ సామాజిక సమస్యలపై విద్యార్థుల లో, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ సంస్థ నుండి అవార్డు రావడంతో తమకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత పసుపుల రాజశేఖర్ హర్షించి మాట్లాడుతూ భావి భారత నిర్మాతలు, సమాజ నిర్దేశకులు అయిన ఉపాధ్యాయులను గుర్తించి, సన్మానించడం గర్వించదగ్గ విషయమని, ఈ అవార్డు స్వీకరించడంతో అంకిత భావంతో పనిచేయడం, సామాజిక బాధ్యతల పట్ల వ్యవహరించడంలో మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.
Comments