సైబర్ అలర్ట్, అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
Topic : “AEPS (Aadhaar Enabled Payment system) withdrawals FRAUD”.
మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ వేలి ముద్రలను తరచుగా సమాచారం నిమిత్తం ఎవరికైనా ఇస్తుంటారా ! అయితే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త ! ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు వేలి ముద్రలను ఆధారంగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసంలో మొదటగా సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను అనగా ఆధార్ కార్డు వివరాలు, మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తారు. ఆ విధంగా సేకరించిన మీ యొక్క ఖాతా, వేలి ముద్రల వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. ఈ విధమైన డబ్బును డ్రా చేసే పద్దతినే AEPS(Aadhaar Enabled Payment system) అని అంటారు.
ఈ AEPS ద్వారా డబ్బులను పొందటం కోసం మీ యొక్క ఖాతాకు లింకు అయినటువంటి ఆధార్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క వేలి ముద్రలు అవసరం. ఈ AEPS withdraw సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ATM సౌకర్యం అందుబాటులో ఉండదో ఆ ప్రాంతాలలో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కల్పించారు. ఈ రకంగా నగదును 10,000/- లోపు మన సౌకర్యం నిమిత్తం డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈ రకంగా బ్యాంక్ ఖాతా ను బట్టి ఎన్ని సార్లయినా సైబర్ నేరగాళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించి ఖాతా దారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
🔹🔹 తీసుకోవాల్సిన జాగ్రత్తలు ...
\
🔹 మీ యొక్క ఖాతా కు లింకు అయినటు వంటి ఆధార్ కార్డు కు మీ మొబైల్ నెంబర్ లింకు చేయాలి.
🔹 మీరు బ్యాంక్ ఖాతాకు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్ స్థానoలో ఇతర ఐడి ప్రూఫ్ ను ఇవ్వండి .
🔹 మీరు తరచుగా మీ యొక్క ఖాతా బ్యాలెన్సు ను చెక్ చేసుకోండి.
🔹 మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, వేలి ముద్రలను అనవసరంగా ఇవ్వకండి.
🔹 మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి.
** ఎవరైనా ఈ విధంగా మోసపోతే
cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు విజ్ఞప్తి చేశారు.
** జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం **
Comments