దావులూరు టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ జడ్పిటిసి జులూం
కంకిపాడు ఎమ్మెల్యే పాస్ ఉంది టోల్ ఫ్రీజ్ కట్టను అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన చందర్లపాడు జడ్పిటిసి.
అడ్డగించిన సిబ్బందిపై జులం ప్రదర్శించి ముందుకు దూసుకుపోయిన జడ్పిటిసి.
వెంటాడి పట్టుకున్న పోలీసులు- ఎటువంటి జరిమానా విధించకుండా వదిలేసిన వైనం.
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై కంకిపాడు టోల్ గేట్ వద్ద నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు జడ్పిటిసి తన దగ్గర ఎమ్మెల్యే పాస్ ఉంది టోల్ ఫీజు కట్టను అంటూ టోల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగడంతో ఎమ్మెల్యే పాస్ చూపించాలని కోరిన సిబ్బంది.
సిబ్బంది అడగడంతో పాస్ చూపించకుండా తనను అడ్డగించిన సిబ్బందితో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించిన జడ్పిటిసి తన వాహనాన్ని వేగంగా టోల్గేట్ దాటిస్తూ ముందుకు వెళ్లిన వైనం. అటుగా వస్తున్న పోలీసులు జడ్పిటిసి వాహనాన్ని వెంబడించి వాహనాన్ని నిలువరించిన పోలీసులు. చివరికి టోల్గేట్ ఫీజు చెల్లించకుండానే అక్కడినుండి ఉడాయించిన అధికార పార్టీ జెడ్పిటిసి.
ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులపై రెండు మూడు సెక్షన్ లతో కేసులు పెట్టే పోలీసులు టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి ట్రాఫిక్ అంతరాయానికి కారణమైన అధికార పార్టీ జెడ్పిటిసి పై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది.
Comments