డాడీ హోమ్ రాజారెడ్డి మరణం వెనక కుట్ర కోణం బయటపడేనా...?
ప్రొద్దుటూరు , తిరుపతి ప్రాంతాల్లో మొత్తం 54 ఎకరాల భూములు ఉన్నట్లు చర్చ...
- అసలు శుక్రవారం రాత్రి రాజారెడ్డిని అంతమొందించేందుకు ముందుగానే కుట్ర జరిగిందా...?
- అందులో భాగంగానే పూజ స్కూల్ కు హోమ్ సిక్ అంటూ హాస్టల్ విద్యార్థులను బయటకు పంపారా...?
- సాయంత్రం ఐదు గంటలకే సీసీ కెమెరాలు బంద్ చేశారంటూ ప్రచారంలో వాస్తవం ఎంత...
అసలు డాడీ హోమ్ రాజారెడ్డి ఎవరి పేరుతో ఆస్తులను రాశారు... ఆ బిడ్డకు రక్షణ ఉందా...?
రాజారెడ్డి మరణం కుట్ర వెనుక కుటుంభ సభ్యుల పాత్ర ఎంత...?
డాడీ...డాడీ...డాడీ... తల్లితండ్రులు లేని ఆ అనాధ బిడ్డలకు ఆయనే తండ్రి అయ్యాడు... ఎయిడ్స్ సోకి కనీసం బిడ్డను ముట్టుకునేందుకు కూడా భయపడే తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన బిడ్డకు ఆత్మబంధువు అయ్యాడు... కుటుంబ సభ్యులు ఉన్నా రోడ్లపై అనాధలుగా వదిలేసిన వృద్ధులకు ఆయన ఆప్తుడయ్యాడు... వ్యక్తిత్వంగా అందరితో కలివిడిగా ఉంటూ విద్యాసంస్థలను నెలకొల్పి గుర్తింపు పొందిన రాజారెడ్డి అదే విద్యాసంస్థలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది... ప్రస్తుతం పూజ ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్ ప్రాంగణం 30 ఎకరాలకు పైగా ఉంది... తిరుపతిలో కూడా రాజారెడ్డికి సంబంధించిన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.. ఆస్తులను పంచాలంటూ గత కొంతకాలంగా రాజారెడ్డి పై కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు , ఈ ఒత్తిడిలో తాను ఎవరికి ఇవి ఇవ్వను... ట్రస్ట్ ద్వారా ఇవి కొనసాగాల్సిందే... అని చెప్పడం ఒకానొక దశలో ఆస్తినంత ప్రభుత్వానికి , అనాధ పిల్లలకు రాసిస్తానని కుటుంబ సభ్యులకు హెచ్చరించడంతో అసలు రాజారెడ్డిని అంతమొందించాలన్న కుట్ర మొదలైంది అన్నది వారి బంధువుల్లో జరుగుతున్న చర్చ...
ఇటీవల కొందరు చోట మోఠా నాయకులు కూడా ఆస్తి పంపకాల విషయంపై రాజారెడ్డికి హెచ్చరికలు జారీ చేయించారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు... అసలు ఎవరు ఆ చోటామోటా నాయకులు వారిని ఎవరు ఆశ్రయించారు , విద్యా వ్యవస్థను నడుపుతున్న రాజారెడ్డి పై వారి పెత్తనం ఏంటి , అన్నది పోలీసులు లెక్కలేస్తున్నారు... శుక్రవారం సాయంత్రానికి పూజ టెక్నో స్కూల్లో హాస్టల్లో ఉన్న విద్యార్థులు అందరిని పంపించడం , ఐదు గంటలకే హాస్టల్లో ఎవరూ లేరు అంటూ సీసీ కెమెరాలు బంద్ చేశారు అన్న విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది...
రాజారెడ్డి ఇప్పటికే ఆస్తిని ఆ అనాధ బిడ్డ పేరుతో రాసేసారా...? మరి ఆ బిడ్డకు రక్షణ ఉందా...?
డాడీ హోమ్ రాజారెడ్డి తన ఆస్తిని అంతా ఇప్పటికే ఓ అనాధ బిడ్డ పేరుతో రాసేసారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ బిడ్డకు రక్షణ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి... ఇంతకీ ఎవర అనాధ బిడ్డ ఆ బిడ్డ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న డాడీ హోమ్ ట్రస్టు కొనసాగించేలా పూజ విద్యాసంస్థలు వ్యవహారాలు కూడా జరిగేలా రాజారెడ్డి వీలునామా రాయడం తోనే ఈ దుర్మార్గానికి కుటుంబ సభ్యులే ఒడిగట్టారు అన్న ప్రచార నేపథ్యంలో పోలీసుల విచారణ కీలకంగా మారింది...
రీ పోస్టుమార్టం లో బయటపడ్డ నిజాలు ఏంటి...?
మొదట పోస్టుమార్టం నిర్వహించిన విషయంలో లోపాలు ఏంటి... రెండవసారి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు నిర్ధారించిన విషయాలు ఏంటి అన్నది పోస్టుమార్టం నివేదిక వస్తే స్పష్టమవుతుంది... అంతలోపు పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడితే కుట్ర కోణంలో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తెలనంది...
ఇప్పుడు ఆ అనాధ బిడ్డలకు ఆసరా ఎవరు...?
ఉన్నట్లుండి ఆ కుటుంబ పెద్ద మృత్యువాత పడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు డాడీ అంటూ పిలిచిన ఆ అనాధ బిడ్డలకు ఆ డాడీని దూరం చేసిన దుర్మార్గుల ను కటకటాల పాలు చేసి, ఒక్క సెంటు ఆస్తి కూడా ఈ కుట్రకు పాల్పడ్డ వారికి చెందకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఈ విద్యాసంస్థలను డాడీ హోమం ప్రభుత్వమే నిర్వహించాలన్నది ప్రస్తుతం డాడీ ఆత్మీయులు, స్నేహితులు, కొందరు బంధువులు కోరుకుంటున్న విషయం... ఈ కుట్రపై మరికొద్ది గంటల్లో పోలీసులు చిక్కుముడి విప్పి బహిర్గతం చేస్తారని ఆశిద్దాం...
Commentaires