వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నేడు పట్టణంలోని ఆదిత్యా రామ్ షాపింగ్ మాల్ నందు డాడీస్ రోడ్ సేఫ్టీ అప్ ను పట్టణ మూడవ పోలీసు స్టేషన్ ఎస్.ఐ రాజ గోపాల్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా డాడీస్ రోడ్ ఆప్ ప్రొద్దుటూరు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియచేసారు, ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాహనదారులకు అత్యవసర పరిస్థితులలో అనగా ఏదయినా ప్రమాదం సంభవించినప్పుడు, లేదా వాహనం పార్కింగ్ వలన ఇతరులకు ఇబ్బందులు కలిగినప్పుడు, ప్రమాదం సంభవించినపుడు అత్యవసరంగా రక్త నిధిని సంప్రదించాలన్నా, వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ నందు పొందుపరచుకొనుటకు వుపయోగపడుతుందని, వాహన యజమాని సంబంధీకులకు నోటిఫికేషన్ ద్వారా వారికి వివరాలు ఎప్పటికప్పుడు తెలియచేయటం, నాలుగు వందల తొంబై తొమ్మిది రూపాయలకే జీవితకాలం పూర్తిగా అప్లికేషన్ అందుబాటులో ఉన్నందున, దీనిని ప్రతి వాహనదారుడు ఉపయోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతరం డాడీస్ రోడ్ సేఫ్టీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ షేక్ నజీర్ మాట్లాడుతూ, జిల్లాలోని పలు పట్టణాలలో ఇప్పటికి అయిదు శాఖలు ఏర్పాటు చేశామని, రాబోవు రోజుల్లో అన్ని నియోజకవర్గాలలో తమ శాఖలను ఇస్తరిస్తామని ఆశాభావం వ్వ్యక్తం చేశారు. తమ అప్లికేషన్ సర్వీస్ ఇరవై నాలుగు గంటలు, మూడువందల అరవై అయిదు రోజులు అందుబాటులో ఉంటుందని, అయిదు లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భరత్ ద్వారా ప్రమాద భీమా సౌకర్యం కలదని, మొబైల్ ద్వారా వాహన వివరాలు స్కాన్ చేసి, లేదా తమ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చని, పట్టణంలోని ప్రతి వాహనదారుడు ఈ సదావకాశాని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. డాడీస్ రోడ్ ప్రొద్దుటూరు శాఖ నిర్వాహకులు ఎం.హుస్సేన్, సి.రామ చంద్ర లకు ఆయన శుభాకాంక్షలు తెలియచేసారు.
Comments