వ్యవసాయ కూలీల కష్టాన్ని తీర్చే చట్టాలు చేయాలి
ప్రొద్దుటూరు: కాలం బట్టి, ఉద్యోగం, వైద్యం, సంక్షేముల ప్రభుత్యాల బాధ్యత అని ఎపిఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. వ్యవసాయ కూలీల కష్టాన్ని తీరే చట్టాన్ని ప్రభూత్యం తీసుకురావాలని సూచించారు.
మన దేశంలో వ్యవసాయు కూలీలు అన్ని కులాలల్లో ఉన్నారు. రోజు వారి కూలి 2004 నుంచి 250/- రైతులకు ఇస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదల జీవన విధానం దేశ వ్యాప్తంగా కష్టంగా ఉంది కదుపు నింపుకోవాడానికి చిన్న పిల్లలు సైతం వెంట బెట్టుకొని ఇతర మిల్లలకు పక్క రాష్ట్రలకు వలసలు పోక తప్పడం లేదని వాపోయారు. వీళ్ళ కష్టాలు తీర్చడానికి ఎన్ని ప్రభూత్యాలు మారిన దృష్టి పెట్టలేదని వీరికి తగిన సమయమున పని చేయించు కోనే చట్టాన్ని ప్రభుత్వం తీసుకరావాలని రాష్ట్ర వ్యవసాయ కూలీల పరి రక్షణ చట్టాన్ని తీసుకరావాలని, ప్రొద్దుటూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎపి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! వ్యవసాయ కూలీల పక్షాన నిలబడి పోరుబాట సాగిస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమం ప్రభావం చూపుతామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల లోని ముఖ్య మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేస్తామని వ్యవసాయ కూలీల కష్టాలను ప్రభుత్యాల ముందు పెడుతామని ఓట్లు వేసిన పేద వాల్ల బాగోగులు చూడవలసిన భాద్యత ప్రభుత్వాలకు ఉందని వివరించారు ఇటివల వలసలు ఎక్కువయ్యాయని, వారికి రవాణ భద్రత ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగభూషణం,బాల లక్ష్మిమయ్య, సుధాకర్, రమణ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు
Comments