చిట్వేలి లో...
మహిషాసుర మర్దిని గా అమ్మవార్లు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు అయిన ఆదివారం చిట్వేలు గ్రామం లోని పలు ఆలయాల్లో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ దసరా నిర్వహించడం, పది రోజులు పాటు వివిధ రూపాలలో అమ్మవారు శక్తి స్వరూపిణి గా భక్తులకు దర్శనం ఇవ్వడం పరిపాటి. కాగా దసరా ఉత్సవానికి కారణమైన మహిషాసుర మర్దిని అలంకారానికి ప్రత్యేకత ఉన్నట్లు ఆలయ అర్చకులు వివరించారు.
అమ్మవారి శాలనందు, శ్రీ వీరభద్రస్వామి శ్రీభద్రకాళి ఆలయం నందు , శ్రీ సోమేశ్వర స్వామి శ్యామలాంబ ఆలయం నందు, శ్రీ మారమ్మ తల్లి ఆలయం నందు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అలంకరణలు చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు సామూహికంగా కుంకుమార్చన గావించారు. ఆలయ పెద్దలు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు.
శ్రీ వాసవి మాత అమ్మవారు.
శ్రీ భద్రకాళి అమ్మవారు
శ్రీ శ్యామలాంబ అమ్మవారు
శ్రీ మారమ్మ తల్లి అమ్మవారు.
Comments