సరస్వతి దేవి అలంకారంలో శ్రీ వాసవిమాత.
--అలరించిన బిందె సేవ ఉత్సవం- పెద్ద ఎత్తున పాల్గొన్న యువత. ఆర్యవైశ్యులు.
మూల నక్షత్రం,దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్వేలి అమ్మవారి శాల నందు ఏడవ రోజు ఆదివారం శ్రీ వాసవిమాత అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకులు చెరుకుమూడి విశ్వనాథ శాస్త్రి సహాయ అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి బిందెసేవ ఉత్సవంలో భాగంగా ఆర్యవైశ్య యువత, ఆర్యవైశ్య పెద్దలు ఉపవాసం పూని, అమ్మవారి శాల నుంచి బయలుదేరి శివాలయంలో అమ్మవారిని అలంకరించుకుని బిందెలోని జలంతో బయలుదేరి గ్రామ వీధులలో ఉత్సవం నిర్వహించగా ఆర్యవైశ్యుల కుటుంబీకులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు.
రాజా, శివప్రసాద్ నాని, దినేష్, సూర్య తదితర యువత వాసవి మాతకు సరస్వతి అలంకరణ చేయగా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు కామిశెట్టి సుబ్రహ్మణ్యం, సభ్యులు
కోటా సుధాకర్, టీవీ సుబ్రహ్మణ్యం,నూతి సత్యం, ఆదూరి శ్రీనివాసులు, ఈ వి శేషయ్య, బొంతల నాగేశ్వరరావు తదితరులు పంచిపెట్టారు.ఆర్యవైశ్య యువత ఈ కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషించారు.
Kommentare