సెప్టెంబర్ 26 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు రానున్నాయి. కరోనా వల్ల మూడేళ్లగా విద్యా బోధన అస్తవ్యస్తం కావడంతో ఈ విద్యా సంవత్సరంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు సెప్టెంబరు 5 నుంచి ఫార్మాటివ్ అసెస్మెంట్-2 (ఎఫ్ఏ) పరీక్షలు నిర్వహించాలని, నవంబరు 1-7 తేదీల్లోపు సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1ను పూర్తి చేయాలని సూచించారు. అలాగే డిసెంబరులో ఎఫ్ఏ-3, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎఫ్ఏ-4 పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక, పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఫిబ్రవరి లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసి వారిని ప్రధాన పరీక్షలకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, డిసెంబరు 22నుంచి28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
Comments