ఘనంగా ప్రారంభమైన ప్రొద్దుటూరు దసరా నవరాత్రి ఉత్సవాలు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దసరా ఉత్సవాలలో దేశంలోనే రెండవ మైసూరు గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాలలో మొదటి రోజులో భాగంగా ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రుద్ర హోమం, చండి యాగం, కుంకుమార్చన నిర్వహించారు. 108 మంది మహిళలతో కలిశాలను చేతపట్టి పురవీధుల గుండా ఊరేగింపుగా అమ్మవారి శాలకు తీసుకొని వెళ్లారు. నేటినుంచి జరగబోవు అమ్మవారి ప్రత్యేక అలంకరణలకు ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుసెట్టి రామ్మోహన్ రావు తెలిపారు.
ความคิดเห็น