అత్తకు ఉరేసిన కోడలు.. ఆపై హైడ్రామా.. పోస్టుమార్టం రిపోర్ట్‌తో సీన్ రివర్స్..!
అనుమానాస్పద మృతి కేసు చివరకు హత్య కేసుగా తేలింది. అత్తను కోడలే చంపి ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ప్రమాదం డ్రామా ఆడారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అంతా తేలడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అంతా బయటకు వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
హత్య చేసి ప్రమాదం అంటూ కోడలు డ్రామా
అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు
తీరా పోస్టుమార్టం రిపోర్ట్‌లో హత్యగా నిర్థారణ
నేరం అంగీకరించిన కోడలు.. కృష్ణా జిల్లాలో ఘటన తేలింది. అత్తను కోడలే చంపి ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ప్రమాదం డ్రామా ఆడారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అంతా తేలడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అంతా బయటకు వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
పెడన మండలంలోని కృష్ణాపురానికి చెందిన పడమట రజనీకుమారి (50) తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉండి మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. రోజురోజుకు పరిస్థితి విషమిస్తుండటంతో బందర్ నుంచి విజయవాడకు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రజనీకుమారి గత నెల 30న మరణించింది. అయితే, కుమారుడు వీరబాబు తన తల్లి ప్రమాదవశాత్తు ఇంట్లో పడిపోవడంతో తీవ్ర గాయాలై మృతిచెందిందని చెప్పడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
అయితే, పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతురాలి మెడపై గాయాలు కనిపించాయని.. ముందుగా తలపై గాయం చేసి, స్పృహ కోల్పోయిన ఆమెను బలవంతంగా ఉరేసి చంపేసినట్లు వైద్యులు నిర్థారించారు. దాంతో, ఈ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కోడలు కొండలమ్మ (26)పై పోలీసులకు అనుమానం రావడంతో.. ఆమెను గట్టిగా ప్రశ్నించారు. దాంతో తానే హత్య చేసినట్లు అంగీకరించింది. కర్రతో దాడి చేసి ఆ తర్వాత ఊపిరాడకుండా చేశానని, కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పడంతో.. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.
Comments