ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం నందు రాణి తిరుమల దేవి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ రాయచోటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో భాగంగా సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాణి తిరుమలదేవి కాలేజీ తరుపున ఎన్నో సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్న అందులో భాగంగా ఈరోజు రక్త నిల్వలు తగ్గడంతో అలాగే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వారి సంస్థ నుంచి చిన్నారుల కోసం, నిరుపేదలకు, క్యాన్సర్ చిన్నారులకు ఎటువంటి టెస్టింగ్ చార్జెస్ లేకుండా ఉచితంగా రక్తం ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో రాణి తిరుమల దేవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, తరుణ్, శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఆకుల రవి కుమార్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comentários