చౌడూరు లో ఓ మహిళకు డెంగీ జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు
ప్రొద్దుటూరు మండలం, కామనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని చౌడూరు లో డెంగీ కేసు నమోదైన విషయం తెలుసుకుని వైధ్యాధికారి డా.హనీఫ్ బాబా ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించి, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. జ్వరాల పైన లార్వ పై సర్వే చేసి, దోమలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలనీ లో బ్లీచింగ్ పౌడర్, అబేట్ పిచికారి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు, సీహెచ్ఓ క్రిష్ణమ్మ, హెచ్ఈ శోభారాణీ, సూపర్ వైజర్ వరప్రసాద్ గౌతమి, పంచాయతీ కార్యదర్శి రమణ, ఆరోగ్య కార్యకర్తలు చంద్ర శేఖర్, వేదావతి, ఆషా కార్యకర్తలు పద్మావతి, సంజమ్మ, వెంకట సుబ్బమ్మ పాల్గొన్నారు.
Comments