top of page
Writer's picturePRASANNA ANDHRA

దేవాంగులను రాజకీయ పార్టీలు గుర్తించాలి - తూతిక శ్రీనివాస విశ్వనాథ్

దేవాంగులను రాజకీయ పార్టీలు గుర్తించక పోతే మూల్యం చెల్లించక తప్పదు.


2024లో దేవంగులకు 10 అసెంబ్లీ, 02 ఎంపి స్థానాలు రాజకీయ పార్టీలు కేటాయించాలి

దేవాంగ కుల గణనకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వెయ్యాలి


చేనేత కులాలని కలుపుకొని త్వరలో ఐక్య కార్యాచరణ ఏర్పాటు


ఘనంగా దేవాంగ కుల గురువు శ్రీశ్రీశ్రీ దయానందపురి స్వామి శోభా యాత్ర


వేడుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకరోత్సవం

ప్రొద్దుటూరు, రాష్ట్రంలో 18 లక్షలకు పైగా ఉన్న దేవంగ కులస్థులను రాజకీయ పార్టీలు విస్మరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు దేవంగులను ఓట్లు కోసం ఉపయోగించుకున్నారని ఇకపై అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కోసం రాష్ట్రంలో ఉన్న దేవంగులు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని రానున్న సర్వత్రిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు దేవంగులకు సముచిత స్థానం కేటాయించాలని డిమాండ్ చేసారు. స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ద్వితీయ కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి ఉట్టి నాగశయనం అధ్యక్షత వహించగా నక్కిన చిన వెంకటరాయుడు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా డీకే నాగరాజు (అనంతపురం), అసోసియేట్ అధ్యక్షులుగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ (ఒంగోలు), ప్రధాన కార్యదర్శిగా పుచ్చల రామకృష్ణ (రాజమహేంద్రవరం), కోశాధికారిగా ఉప్పు కనకరాజు (విశాఖపట్నం), అధికార ప్రతినిధిగా కేకే సంజీవరావు (రాజమహేంద్రవరం)తో పాటు 50 మంది కార్యవర్గ సభ్యులు, 75 మంది కో-ఆప్షన్ సభ్యులు, అనుభంద సంఘాల సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆల్ ఇండియా దేవాంగ కోస్తా కోస్తీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అరుణ్ వారోడ్ (మహారాష్ట్ర), హిందుపురం మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప హాజరై పార్టీలకు అతీతంగా దేవంగులు అందరు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సందర్బంగా నూతన అధ్యక్షులు డీకే నాగరాజు మాట్లాడుతూ దేవంగుల సంక్షేమానికి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేవంగులు కేటగిరి 'బీ'లో ఉన్నారని దేవాంగ కుల ఘనన చేసి సంఖ్య పరంగా ప్రభుత్వ సంస్థలలో, బోర్డులలో, స్థానిక సంస్థలలో, అధికారికంగా దేవంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని, రాజకీయ పార్టీలు రానున్న సర్వత్రిక ఎన్నికలలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు కల్పించాలని అన్నారు. అసోసియేట్ అధ్యక్షులు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న చేనేత కులాలను కలుపుకొని చేనేత సమస్యల పరిష్కారానికి, ఇతర వెనుకబడిన కులాలను ఐక్యం చేసి చట్టసభలలో ప్రాధాన్యతకు ఐక్య కార్యాచరణ చెప్పడతామన్నారు.

దేవంగులు వృత్తి పరంగా చేనేత రంగంపై ఆధారపడి బ్రతుకుతుంటారని ప్రభుత్వ సహకారం కొరవడి చేనేత రంగం అంపశయ్యపై ఉందని భారతదేశ సంస్కృతికి చిహ్నమైన చేనేతను సంరక్షించే భాద్యత ప్రభుత్వానిదని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దేవాంగ ప్రతినిధులు అన్నారు. కార్యక్రమంలో దేవంగుల, చేనేతల కార్మికులు సంక్షేమం, అభివృద్ధిపై పలు తీర్మానలు చేసారు. తీర్మానలలో కొన్ని దేవంగుల కుల గనన ప్రభుత్వం జరపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వం చేనేత మీద విధించిన వస్తు, సేవ పన్నును (జి.ఎస్.టి) తొలగించాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, హ్యాండ్లూమ్ మరియు టెక్సటైల్ శాఖ నుంచి హ్యాండ్లూమ్ (చేనేతను) వేరుచేసి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకాన్ని చేనేత అనుభంద కార్మికులకు కూడా వర్తింపు చెయ్యాలని, చేనేత ఉపప్రణాళిక బిల్లును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోధించి చేనేత రంగానికి, చేనేత కార్మికులకు ఆర్ధికంగా సహకరించాలని, చేనేత సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం 250 కోట్లతో ప్రత్యేక గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను కేటాయించాలని, జగనన్న శాశ్వత గృహ పథకంలో స్థలం, గృహల కేటాయింపు వలన మగ్గం నేసే చేనేత కార్మికులకు ఉపయోగకరంగా లేనందున గృహ నిర్మాణంలో స్థలం కేటాయింపు పెంచాలని, గృహ నిర్మాణంలో మగ్గం కోసం వర్క్ షెడ్ రూమ్ కేటాయించాలని, రాజకీయ పార్టీలు దేవంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని తదితర అంశాలతో తీర్మానం చేసారు. ముందుగా దేవాంగ కుల గురువు హంపి హేమకోటి పీఠధిపతులు జగద్గురువు శ్రీశ్రీశ్రీ దయానంధపురి స్వామీజీకి జేజేలు పలుకుతూ ప్రొద్దుటూరు దేవాంగ సంఘం వారు పురావీధులలో ఘనంగా శోభా యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ప్రొద్దుటూరు దేవాంగ సంఘం అధ్యక్షులు ఉట్టి నాగశయనం సారద్యం వహించగా ప్రొద్దుటూరు దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు కార్యక్రమానికి సంధానం కర్తలుగా వ్యవహారించారు.


కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, డా సజ్జ హేమలత, దేవి ప్రకాష్, ఊటుకూరి సుబ్రహ్మణ్యం, నిమ్మల సదాశివ, రిటైర్డ్ ఐ ఎ ఎస్ చిరంజీవులు, కె ఎస్ వి కె, చోళ రాజేశ్వర్ రావు, నారాయణ రావు వాడ్, పండిట్ రావు, పృద్వి రవి మరియు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి దేవాంగ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరు అయ్యారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు డీకే నాగరాజు సారథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి దేవాంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వనున్నారు.

118 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page