పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, జీవీఎంసీ 74 వ వార్డు వైసీపీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు సరివేగంగా జరుగుతున్నాయి.
అభివృద్ధి పనులలో భాగంగా ఎస్ సి, ఎస్టీ నిధులతో పెదగంట్యాడ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతి గృహంకు ప్రహరీ గోడను 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ పూజా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డితో కలిసి భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ బాలికల వసతి గృహం శిదిలా వ్యవస్థకు చేరి అక్కడ ఉంటున్న బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నాసంగతి తమ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి శిదిలా వ్యవస్థకి చేరుకున్న ప్రహరీ గోడ 10 లక్షల రూపాయలు నిర్మాణంతో పాటు ఇతర సదుపాయాలు కూడా కలిపించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. వంశీరెడ్డి మాట్లాడుతూ బాలికల వసతి గృహం యొక్క ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, కుక్కలు స్వరవిహారం చేస్తున్నాయని దీనివలన ఇక్కడ ఉంటున్న బాలికలు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి హాస్టల్ వార్డెన్ అన్నపూర్ణ ద్వారా తమ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించి వసతి గృహ సమస్యను స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనల మేరకు గత 10 రోజుల కిందన జీవీఎంసీ ప్రధాన కమిషనర్ లక్ష్మీ షా పర్యటనలో ఆయన దృష్టికి తీసికెళ్లడం జరిగిందని తెలిపారు. తక్షణమే స్పందించిన కమిషనర్ లక్ష్మీ షా ఆదేశాలతో ఎస్ సి, ఎస్టీ నిధులతో ప్రహరీ నిర్మాణం అలాగే హాస్టల్ లో మిగిలిన అన్ని సదుపాయాలు కలిపించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వార్డులో ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఈ డబ్ల్యూ ఐ డి సి ఎఇ పద్మ, వార్డు పార్టీ ముఖ్య నాయకులు ఎన్ వై నాయుడు, సాలాపు రాజారావు, బొడ్డు గోవిందా, లోకేష్, త్రినాధ్, గోరుసు రామలక్ష్మి, ఒమ్మి ఈశ్వరి, ప్రసాద్ రెడ్డి, మనోజ్, రవి, చంద్రశేఖర్, గోందేశీ పెంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments