పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, కన్నుల పండుగుల శ్రీ కుంచ మాంబ ఆలయంలో శ్రీ సర్వమంగళ సమేత మృత్యుంజయే శ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.
గాజువాక జీవీఎంసీ 75 వ వార్డు పెదగంట్యాడ గ్రామ ఆరాధ్య దేవత శ్రీ కుంచ మాంబ పున విగ్రహ ప్రతిష్ట మరియు శ్రీ గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ. శ్రీ సర్వమంగళ సమేత మృత్యుంజయే శ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ట ఘనంగా ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి, శ్రీమతి వెంకట విజయ కుమారి దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు వైసీపీ గాజువాక ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 74 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ నెంబర్ తిప్పల వంశీ రెడ్డి, ఆలయం దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ మా గ్రామదేవత శ్రీ కుంచ మాంబ అమ్మవారి ఆశీస్సులు గాజువాక నియోజకవర్గ ప్రజల పై ఉండాలని అలాగే మూడు రోజులుగా విశేష పూజలు నిర్వహించి ఈరోజు విగ్రహలు ప్రతిష్ట కలశం ప్రతిష్ట కన్నుల పండగల నిర్వహించడం చాలా సంతోషకరం అని ఆయన అన్నారు. అనంతరం మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి వెంకట విజయ్ కుమార్ దంపతులు మాట్లాడుతూ పెద గంట్యాడ గ్రామ ప్రజల పై అలాగే నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పం ముగింపు రోజు గుడిపై కలశాలు ప్రతిష్ట శ్రీ గణపతి. సుబ్రహ్మణ్య నవగ్రహ.శ్రీ సర్వమంగళ సమేత మృత్యుంజయే శ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ట ఘనంగా వేద పండితుల హోమాలు నిర్వహించి భక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ విధంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని వారు మాట్లాడారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం సుమారు ఐదువేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో తిప్పల వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comentarios