శ్రీ దత్తగిరి నారాయణ తపోవనం నందు..
-- శ్రీ అభయాంజనేయ స్వామి మూలవిగ్రహ ప్రతిష్ట.
---శివపార్వతుల, సీతారాముల కళ్యాణం.
--- దాతల అన్నదాన కార్యక్రమం.
--- కార్యక్రమాల్లో పాల్గొన్న రాజకీయ నాయకులు.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రాపూర్ రోడ్డు, తిమ్మాయపాలెం సర్కిల్ వద్ద వెలసిన శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమం నందు ఈరోజు వేకువజామున శ్రీ అభయాంజనేయ స్వామి మూల విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. తదుపరి శివపార్వతుల మరియు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పండిత సుబ్బు స్వామి మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాల మధ్య ఈ కార్యక్రమాన్ని కనుల విందుగా ఆలయ ధర్మకర్తలు కొరముట్ల నారాయణమ్మ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో జరిపించారు.
వారు ఇరువురు మాట్లాడుతూ ఆశ్రమ పరిధిలో విగ్రహ ప్రతిష్ట లోనూ అభివృద్ధి తదుతర కార్యక్రమాలలోనూ తన తోడ్పాటు అందించిన ఎంపీ మిధున్ రెడ్డికి, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులకు, మండల నాయకులకు, అధికారులకు, మండల ప్రజలకు, శివశక్తి సభ్యులకు, తదితరలందరికీ కృతజ్ఞతలు తెలపారు. కళ్యాణ కార్యక్రమంలోనూ, అన్నదాన కార్యక్రమంలోనూ భక్తులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు సంతోషం వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి నాయకులు ఎల్.వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి,మలిశెట్టి వెంకటరమణ, చక్రపాణి రెడ్డి, గిరిబాబు రాజు,ఎన్ చంద్రశేఖర్ రెడ్డి,శివశక్తి సభ్యులు, పాత్రికేయులు,మండల వ్యాప్తంగా భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా ఉప్పలపాటి గురువరాజు, సుండుపల్లి వాసి సుధాకర్ రాజులు అన్నదాతలుగా సాయం అందించారు.
Comments