ధర్మవరం ఎమ్మెల్యే కబ్జాలపై మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ ఫైర్.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనకు సంబంధించిన భూములకు అధిక ధరలు వస్తాయనే కారణంతో పట్టణంలో హీరో హోండా షోరూం వద్ద ఆర్ అండ్ బి కు చెందిన 562 S NO లో 92 సెంట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని, ప్రస్తుతం ఈ భూమి సెంటు 40 నుండి 50 లక్షల వరకు ఉన్నదని దీనికి పోలీస్ వారు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని, ఇది చాలా తప్పు అని దొంగ బంగారాన్ని అమ్మిన కొనిన కూడా ఎలా తప్పు అవుతుందో భవిష్యత్తులో ఎమ్మెల్యే అమ్ముతున్న స్థలాలు ఇలా దొంగ బంగారంతో సమానమేనని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు.
ధర్మవరం ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ఆర్ అండ్ బి అధికారులు స్థానిక పోలీసు అధికారులు సహకరిస్తున్నారని విచారణ అనంతరం అందరి పై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే స్థానిక శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలన్నీ బయటికి తీసి కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసి DSP మరియు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అతనితో పాటు అధికారులు కూడా జైలుకు పంపడం జరుగుతుందని గోనుగుంట్ల సూర్యనారాయణ తెలిపారు.
అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ పేరుతో విలువైన భూములను ఆక్రమించి ఆ స్థలాలు అమ్మి సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు సంపాదించాడని దయచేసి ఎవరు ఎమ్మెల్యే చేస్తున్న మోసాలకు మోసపోవద్దని చెబుతూ ఎమ్మెల్యే చేస్తున్న ఒక్కొక్క అక్రమాలను ప్రతి 15 రోజులకు ఒకసారి బయటకు తీస్తాం అని ఈ సందర్భంగా గోనుగుంట్ల సూర్యనారాయణ హెచ్చరించారు. అనంతరం చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన బాధితులకు మరియు గాయపడ్డ వారికి ఇంటింటికీ వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
Comments