విద్యుత్ చార్జీల డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర సరుకులు తగ్గించాలి సీపీఐ.- రేపు గ్రామ సచివాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయండి.
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం బోయపల్లె, పోలోపల్లె, ఎస్. టి. కాలనీ దేవమాచ పల్లి, గట్టు మీద పల్లి, కెఎస్ అగ్రహారం తదితర గ్రామాలలో ఈ రోజు సీపీఐ బాధ్యులు కరపత్రాలు పంచుతూ ఆందోళన విషయంపై ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా చిట్వేల్ సిపిఐ మండల కార్యదర్శి, తిప్పన ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్ కేశం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం చిట్వేల్ మండల కార్యదర్శి సామా గంగయ్య లు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వం, ఇష్టాను సారంగా అన్నీ రకాలు గా ధరలు పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందుల కు గురిచేయడం ప్రభుత్వాల కు మంచిది కాదని హెచ్చరించారు. పెట్రోలు 123 , డీజల్ 106 , వంట గ్యాస్ 1060 రూపాయల కు కేంద్రం పెంచితే , నేనేమీ తక్కువ కాదనే తీరులో రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలు , ఇంటి పన్ను , చెత్త పన్ను , డ్రైనేజీ పన్ను లు విధిస్తూ ప్రజల పై మరింత భారం మోపడం తగదని అన్నారు . పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం వల్ల అన్నీ రకాల వస్తువులు పప్పు , నూనె , చింతపండు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోతున్నాయని మండి పడ్డారు . బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 8 ఏళ్ళు దాటిన అన్నీ ప్రైవేట్ పరం చేస్తూన్నారన్నారు.
రేపు సచివాలయాల వద్ద జరిగే ధర్నాకు సిపిఐ పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో, చుక్కా రామయ్య, మస్తాన్, పెంచలయ్య, సామ ప్రసాద్, నరేష్, సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Comments