top of page
Writer's pictureEDITOR

ఇన్సులిన్‌.. ఇక సూది ద్వారానే కాదు!

ఇన్సులిన్‌.. ఇక సూది ద్వారానే కాదు!

ఓరల్‌ స్ప్రే అభివృద్ధి చేసిన హైదరాబాదీ కంపెనీ


మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ఇన్సులిన్‌ తీసుకోవాలంటే సూది గుచ్చుకోకతప్పదు. ఈ బాధ తీరిపోయే సమయం ఎంతో దూరం లేదు..


టెక్నాలజీస్‌ 'సూది అవసరం లేని, నోటి ద్వారా తీసుకునే(ఓరల్‌) ఇన్సులిన్‌ స్ప్రే 'ఓజులిన్‌'ను' అభివృద్ధి చేసింది. తద్వారా మధుమేహ చికిత్సలో నొప్పిలేని ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్‌కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించినట్లు నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌; ట్రాన్స్‌జీన్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కె. కోటేశ్వర రావు తెలిపారు. ఇపుడు ఓజులిన్‌పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు కంపెనీ దరఖాస్తు చేసింది. మనుషులపై క్లినికల్‌ పరీక్షలను నిర్వహించడానికి ముందు ఇది తప్పనిసరి. నీడిల్‌ఫ్రీ మాతృ సంస్థే ఈ ట్రాన్స్‌జీన్‌ బయోటెక్‌.


99 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page