top of page
Writer's pictureEDITOR

కడప జిల్లాలో వజ్రాల గనులు

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల గనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వజ్రాల గనులు : కడప డైమండ్ మైన్స్ పై సర్వే నివేదిక ; ఏపీ పంట పండినట్టేనా !!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇక ఈ వార్త కడప జిల్లా వాసులను పెన్నా నది పరివాహక ప్రాంతం పై ఫోకస్ చేసేలా చేస్తోంది. తాజాగా అన్ని రాష్ట్రాల మైనింగ్ శాఖలతో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే తాలూకు నివేదికలను ఆయా రాష్ట్రాలకు అందజేశారు. ఆయా రాష్ట్రాల నుండి హాజరైన మైనింగ్ శాఖా ఉన్నతాధికారులు ఆ నివేదికలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప వజ్రాల గనులు ఉన్నట్టు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది . కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశముందని, అక్కడ వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు.


197 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page