నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్బంగా... మండల వైద్య అధికారిని శైలజ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల మరియు కస్తూరిబా స్కూల్ నందు క్షయ వ్యాధి నివారణ పై సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా డాక్టర్ శైలజ మరియు డాక్టర్ శివ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ క్షయ వ్యాది "మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్" అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుందని, క్షయవ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా.. వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుందనీ, ముఖ్యంగా ధూమపానం మద్యపానం, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఇది ఎక్కువ ప్రభావం చూపుతుందని.. అయితే క్షయవ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి వైద్యులు సూచించిన కాలం పాటు మందులు వాడితే నిర్మూలన సాధ్యమని అన్నారు. పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే అందరి సహకారాలు అవసరమని, దీని లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం, బరువు కోల్పోవడం.. అలాంటి వారు తప్పకుండా తమ దగ్గర లోని ప్రాథమిక ఆసుపత్రిలో పరీక్ష చేయించు కొని, వ్యాధి నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన మందులు వాడినట్లయితే ఈ మహమ్మారి నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వారు పేర్కొన్నారు. ఇది కుటుంబ సభ్యుల తోడ్పాటు తోనే సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమము లో డాక్టర్ శివ ప్రసాద్ గౌడ్,టి బి సూపర్ వైజర్ పీరయ్య, సూపర్ వైజర్ ఇస్మాయిల్ బాషా, ల్యాబ్ సూపర్వైజర్ బలరాం, త్రివేణి, పద్మ, ఆశ వర్కర్లు, పాఠశాలల పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.
Comments