---పిచ్చికుక్కల కాట్లకు గురవుతున్న ప్రజలు.
--చికిత్స అందించడంలో వైద్యుల జాప్యమన్న విమర్శలు.
కుక్కల స్వైర విహారం ఆపై పిచ్చికుక్కల కాట్లతో చిట్వేలు మండలంలోని పలుపల్లెలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు.
చిట్వేలు పరిధిలోని రాజుకుంట, అనుంపల్లి లో రాపూరు సరిహద్దున రాపూరు గ్రామాల వారు కుక్కలను తమ ఊరి నుంచి తరలించి అడవుల్లో విడిచి వెళ్లడంతో తిండి లేక నీరసించి, అవి కాస్త రహదారి వెంబడి వచ్చి పల్లెల్లో ఉన్న కుక్కలతో గలాట పడి కలిసిపోయి పిచ్చికుక్కలుగా తయారవుతున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో మనుషులను పశువులను ఇస్టాను రీతిలో కరవగా పశువులు మరణించిన సంగతి కూడా ఆ గ్రామలలో చోటుచేసుకుంది.
స్థానికులు వెంబడించి అలాంటి కుక్కలను చంపినప్పటికీ వాటి కాటుకు గురై మరికొన్ని ఆలస్యంగా పిచ్చికుక్కలుగా మారిన వైనం ఆ రెండు గ్రామాల్లో తరచూ చోటు చేసుకుంటూ ఉంది.
బుధవారం రాత్రి ఎస్టీ కాలనీకి చెందిన ఆరుగురు వ్యక్తులను రాత్రి సమయంలో నిద్రిస్తూ ఉండగా పిచ్చికుక్క ఒకేసారి 6 మందిని గాయపరిచింది. కాగా గురువారం ఉదయం స్థానిక పిహెచ్సికి వైద్య నిమిత్తం వచ్చిన బాధితులకు డాక్టర్ అందుబాటులో లేక సిబ్బంది డాక్టర్ చెప్పేంతవరకు వైద్యం అందించడానికి వీలుకాదు అనడం పలు విమర్శలకు తావిస్తోంది. పెద్ద స్థాయిలో గాయలయినప్పుడు మా వల్ల కాదు ఇంజక్షన్ తప్ప కొన్ని రకాల మందులు రాజంపేటలోనే లభిస్తాయని బాధితులకు సూచిస్తూ తమ పని ముగిసిందనుకుంటున్నారన్న విమర్శలు చిట్వేలి ప్రాథమిక ఆసుపత్రి పై అనేకం. వైద్యులు సకాలంలో వైద్యాన్ని అందించాలని ప్రత్యేక సూచనలు సలహాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కుక్క కాటు నుంచి ప్రజలను కాపాడాలని సదరు గ్రామ ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మండల వ్యాప్తంగా ప్రజలు ముకుమ్మడిగా కోరుతున్నారు.
Comments