top of page
Writer's picturePRASANNA ANDHRA

టీడీపీకి విరాళాల వెల్లువ

మహానాడులో చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో.. టీడీపీకి విరాళాల వెల్లువ


మహానాడులో విరాళాలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. పార్టీకి విరాళాలు ఇవ్వాలని.. కొంత మంది ప్రకటించి, ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఈసారి విరాళం ప్రకటించడం కాదని.. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే తగిన గుర్తింపునిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన ఫలితాన్నిచ్చింది. తొలిరోజు మహానాడు సందర్భంగా టీడీపీకి భారీగా విరాళాలు వచ్చాయి. గుంటూరుకు చెందిన పార్టీ నాయకుడు మన్నవ మోహనకృష్ణ రూ.31,60,000 విలువైన తాగునీటి బాటిళ్లు అందించారు.

అలాగే, గుంటూరుకు చెందిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (గుంటూరు) పార్టీకి అత్యధికంగా రూ.27 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దామచర్ల జనార్దన్‌ (ఒంగోలు), ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు) రూ.25 లక్షలు చొప్పున విరాళాలిచ్చారు. ఆర్‌.శ్రీనివాసరెడ్డి (కడప), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), గల్లా జయదేవ్‌ (గుంటూరు) రూ. 20 లక్షలు చొప్పున విరాళం అందించారు.


రూ.15 లక్షలు ఇచ్చినవారు


బీసీ జనార్ధన్‌ రెడ్డి (బనగానపల్లె), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి).

రూ.10 లక్షలు ఇచ్చినవారు

జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్‌ (గుంటూరు), దామచర్ల సత్య (ఒంగోలు), ఎంఎం.కొండయ్య (చీరాల), పమిడి రమేష్‌ (ఒంగోలు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), శంకర్‌ యాదవ్‌ (తంబళ్లపల్లె).


రూ.5 లక్షలు ఇచ్చినవారు


డేగల ప్రభాకర్‌ (గుంటూరు), వేగేశ్న నరేంద్రవర్మ (బాపట్ల), బొల్లినేని రామారావు (ఉదయగిరి), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), కొమ్మాలపాటి శ్రీధర్‌ (పెదకూరపాడు), పిన్నమనేని వీరయ్య (గుడివాడ), ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి), బీఎన్‌ విజయ్‌కుమార్‌ (సంతనూతలపాడు), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (తెనాలి), ఎం.అశోక్‌రెడ్డి (గిద్దలూరు), ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), టీజీ భరత్‌ (కర్నూలు), పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి (కొవ్వూరు), తోట సీతారామలక్ష్మి (భీమవరం), ఆదిరెడ్డి వాసు (రాజమహేంద్రవరం), ఎ.రాధాకృష్ణ (తణుకు), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), మన్నం సుబ్బారెడ్డి (డోన్‌)..

26 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page