డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఘన నివాళులు
నందలూరు మండలం పరిషత్ అధ్యక్షుడు మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67 వర్ధంతి వేడుకలు నందలూరు బస్టాండ్ కూడలిలో గల అంబేద్కర్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలోని అన్ని మతాలకు కులాలకు సమానత్వాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దాని వర్గాల కు సమానత్వం అనే హక్కును కల్పించిన మార్గదర్శికుడు అలాగే పరిపాలన దాతృత్వం లో ఎన్నో చట్టాలను తను రచించిన రాజ్యాంగం ద్వారా అందించడం జరిగిందని ప్రస్తుతం ఆ రాజ్యాంగం లోని అంశాలు ఆధారంగానే పరిపాలన సాగుతూ ఉందని అటువంటి వ్యక్తిని మనం ఎన్నటికీ మరువలేం అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబూ సూర్య నారాయణ, నందలూరు మాజీ ఎంపీటీసీ మోడపోతుల రాము, గుణ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Comments