5 బస్సులు, సొంత వాహనాలలో విజయవాడకు - ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈనెల 19వ తారీఖున భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ విజయవాడ నడిబొడ్డున దాదాపు 19 ఎకరాల సువిశాల మైదానంలో 125 అడుగుల డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రజాస్వామ్య వాదులకు శుభదినం అంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ తమ ప్రభుత్వ హయాంలో జరగటం గర్వించదగ్గ విషయమని, వందల కోట్ల రూపాయల వ్యయంతో తమ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా మ్యూజికల్ మౌంటెన్, లైబ్రరీ, మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్, అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ థియేటర్ ఏర్పాటు చేశామని అన్నారు. పండుగ వాతావరణంలో విగ్రహావిష్కరణ జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రం నలుమూలల నుండి దళిత జాతి నాయకులు, బిడ్డలు, అగ్రవర్ణాలకు చెందిన ప్రజాస్వామ్య వాదులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు బస్సులలో దాదాపు 250 మంది విజయవాడకు చేరన్నట్లు, ఇందులో భాగంగానే ప్రొద్దుటూరులోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు వారి వారి వాహనాలలో విజయవాడకు చేరుకుంటారని, సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం తిరిగి ప్రొద్దుటూరుకు బయలుదేరుతామని ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడించారు.
Commentaires