లౌకికత్వానికి ప్రతిరూపాలే దూదేకుల కులస్తులు - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగే లౌకికత్వానికి ప్రతిరూపాలే దూదేకుల కులస్తులని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం స్థానిక కొర్రపాడు రోడ్ నుండి పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ నూర్ బాషా దూదేకుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన వారి ఉద్దేశించి మాట్లాడుతూ, దూదేకుల కులస్తులతో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని వారికి ఇష్టమైనదే తాను ఇష్టంగా భావిస్తానని వారికి ఇష్టం లేనిది తాను ఏనాడు ఇష్టపడనని తెలిపారు దూదేకుల కులస్తులకు కావలసిన వాటిని సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దూదేకుల కులస్తులు అంటే దేశంలోనే లౌకికత్వానికి ప్రతిరూపాలుగా నిలుస్తారన్నారు. అటు హిందుత్వానికి ఇటు ముస్లిం ఆచారాలకు విలువనిస్తూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న నిదానంతో జీవనం కొనసాగిస్తున్న వర్గం దూదేకుల కులస్తులే అని అభిప్రాయపడ్డారు. దేశంలో పరమత సహనానికి నిలువెత్తు నిదర్శనం నూర్ భాషా దూదేకుల కులస్తులేనని పేర్కొన్నారు.
వాస్తవంగా దూదేకుల కులస్తులంటే పత్తిలో గింజలు వేరు చేసి దూది ఏకి పరుపులు దిండ్లు తయారు చేసే వారిని కాలక్రమమైన ఆవృత్తి అంతరించడంతో మరొక వృత్తిని అందిపుచ్చుకొని జీవన ప్రయాణం కొనసాగించారన్నారు. అన్ని వృత్తులను అవపోసన పట్టిన దూదేకులు యాచక వృత్తిలో లేకపోవడం వారి జీవన పోరాటానికి నిదర్శనం అన్నారు. దూదేకుల కులస్తులలో కూడా ఆణిముత్యాలు లాంటి వారు జన్మించారని గుర్తు చేశారు. దూదేకుల కులస్తులను సమాజంలోని కుల సంఘాలు అసమానతలు వివక్ష చూపిన మొక్కవోని ధైర్యంతో బ్రతుకు బండి ముందుకు సాగించిన వారే దూదేకుల కులస్తులని కొనియాడారు. ముస్లింలు ఆదా ముస్లింలని అవమానించిన, హిందువులు మిమ్ములను హిందువు కాదన్న హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని కలుపుకొని దూదేకుల కులస్తులు వెళ్లడం అభినందనీయమన్నారు. ఇలాంటి దూదేకుల కులస్తులకు తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాయ్ అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం లో సుమారు 1500 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఆయన వివరించారు. మున్సిపల్ నిధుల ద్వారా 120 కోట్లతో ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ప్రతిరోజు త్రాగునీరు రోడ్లు మురుగు కాలువలు వైద్య సేవలకు పెద్దపీటవేశామన్నారు నియోజకవర్గంలో 24 వేల మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇల్ల నిర్మాణం చేపట్టామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో నిజంగా మీకు మేలు జరిగి ఉంటేనే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా వల్ల మీకు మేలు జరిగి ఉంటేనే ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వైయస్ అవినాష్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు నూర్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో తమను దూదేకుల పింజారి నదాఫ్ కులస్తులమని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళమని తెలిపారు విద్యా ఉపాధి రాజకీయంగా నూర్ భాషాలు రాణించినప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామన్నారు రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమని భద్రసాలలో ఉచిత మధ్యాహ్న భోజనం ఇమామ్లకు గౌరవ వేతనం అజ్జాతరకు విజయవాడ నుండి విమానం ఏర్పాటు ఆడబిడ్డల పెళ్ళికి ఒక లక్ష రూపాయలు దూదేకుల కులస్తులకు జగన్ సర్కార్ ఆర్థిక సహాయం అందించింది అన్నారు. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ ఓతూరు రసూల్ నూర్ భాషా దూదేకుల సంఘం నాయకులు మాట్లాడుతూ నూర్ భాషా దూదేకుల కులస్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొద్దుటూరు పట్టణ నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షులు నాగూరు మాట్లాడుతూ నూర్ భాషా దూదేకుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన సమస్యల పరిష్కారానికి నిత్యం మనమంతా ఏకమై పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పగడాల దస్తగిరి మాట్లాడుతూ నూర్ భాషా దూదేకుల ఆత్మీయ సమావేశానికి తరిమి రావాలని ఇచ్చిన పిలుపుమేరకు అశేషంగా పాల్గొన్న దూదేకుల కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నూర్భాష దూదేకుల సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, కోటవీధి రమేష్, పులివెందుల మహమ్మద్ రఫీ, సుంకేసుల బాదుల్లా, సుభాన్ బి, నిర్వాహకులు కల్లూరు మహమ్మద్ రఫీ, వాటర్ ప్లాంట్ సుభాన్, మేస్త్రి సుబ్బరాయుడు, ఫక్రుద్దీన్, జూటూరు దస్తగిరి, దూదేకుల దస్తగిరి, పగిడాల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments