ఉత్తమ ఉపాధ్యయునిగా చిట్వేలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు దుర్గరాజు.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య మరియు కడపజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లా పరిషత్ కార్యాలయం నందు బుధవారం జరిగింది.
చిట్వేలు ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు ని ఉత్తమ ఉపాద్యాయ అవార్డు కి ఎంపిక చేసి, జడ్పీ చైర్మన్ ఆకే పాటి అమర్నాథరెడ్డి,కలెక్టర్ విజయరామరాజు ,ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా విద్యాధికారి రాఘవ రెడ్డి సమక్షంలో శాలువా తో సన్మానించి, ప్రశంసా పత్రం ,మెమోంటో అందచేశారు. వీరితోపాటు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి దుర్గరాజును అభినందించారు.
ఈ సందర్భంగా చిట్వేలి ఉన్నత పాఠశాలపాఠశాల ప్రధానోపాయులు కృష్ణమూర్తి ,ఉపాద్యాయ బృందం ,బోధనేతర సిబ్బంది మొదలగు వారు హర్షం వ్యక్తం చేసి,అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ ,నవీన్ కుమార్, కిరణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
దుర్గరాజు మాటల్లో:-- బోధనా వృత్తిని దైవంగా భావించి నిబద్ధతతో పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్న తనకు.. ప్రతిభను గుర్తించి అవార్డును ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నానని బాధితుడు దుర్గరాజు ఆన్నారు.
Comentarios