ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని అన్యమత ప్రచారం
కడప జిల్లా, దువ్వూరు
విద్యార్థులు పాఠశాలకు బొట్టు పూలు పెట్టుకొని రావద్దంటూ బుక్కాయపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్ కుమార్ హుకుంజారి చేశారు. బొట్టు, పూలు పెట్టుకుని పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టిన వైనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు దేవుని మార్గంలో నడిస్తే ఉత్తీర్ణులవుతారు, లేకుంటే ఫెయిల్ అవుతారని ప్రధానోపాధ్యాయుడు తెలిపినట్టు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు పాఠశాలను ముట్టడించారు. అన్యమత ప్రచార దుశ్చర్య మీడియా లో వైరల్ కావడంతో స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన దువ్వూరు మండల విద్యాశాఖ అధికారి రవికుమార్. విద్యార్థుల తల్లిదండ్రులు పిర్యాదు మేరకు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. హుటాహుటిన ఉపాధ్యాయులను బదిలీ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. విచారణ అనంతరం ఆరోపణలు రుజువైతే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపిన విద్యాశాఖ అధికారి రవికుమార్.
Comentários