శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో..ధ్వజస్తంభ నిర్వహణ.
- పాల్గొన్న వేలాదిమంది భక్తజనం.
- భారీ ఎత్తున అన్నదానం.
- ఆనందం వ్యక్తపరచిన ధర్మకర్త రామచంద్రయ్య .
- పూజాక్రతువుల నిర్వహించిన పండితులు సుబ్రహ్మణ్యం శర్మ.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం రాజు కుంట పంచాయతీలోని క్రాస్ రోడ్డు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద 12వ తేదీ మొదలైన ఉత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి . గత రెండు రోజులుగా వినాయకుని మొదలు నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగ పడగలు ఇలా పలు దేవ దేవతల విగ్రహాలను ప్రతిష్టించి.. పండిత సుబ్రహ్మణ్యం శర్మ తదతర పురోహితుల వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, దాతల అన్నదనాలతో అత్యంత వైభవంగా నిర్వహించగా.. ఈరోజు వేకుజాము మొదలు ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో.. మండల పరిధిలోని భక్తజన సంద్రోహం భారీ ఎత్తున పాల్గొనగా ధ్వజస్తంభ నిర్వహణ అత్యంత వైభవంగా జరిగింది.
ఆలయ ధర్మకర్త రామచంద్రస్వామి మాటల్లో:- మనుషులు కూడా నిలవకుండా నిర్మానుషంగా ఉన్న ఈ ప్రదేశంలో సర్వస్వం ఆంజనేయుడు అని నమ్మి సరిగ్గా 25 ఏళ్ల ముందు ప్రారంభించిన చిన్నపాటి ఆలయ నిర్మాణం..బస్సులు, వివిధ వాహనాలు ఇచ్చట ఆపి ప్రయాణికులు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడగట్టి, అంతేకాక గుడి అభివృద్ధి గురించి తెలుసుకున్న రాజకీయ నాయకులు, ప్రతినిధులు, ప్రజలు, వ్యాపారస్తులు, ఇతర రాష్ట్రాల వారు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా గుడి నిర్మాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా చేయూతనియడంతో ఆలయంలో అవసరమైన పలు దేవత విగ్రహాలను, కళ్యాణ మండపాన్ని నిర్మించడంలో పురోగతి సాధించామని; ఇంకనూ ఇక్కడ నిర్వహించే పలు కార్యక్రమాలకు శాశ్విత వంటశాల లాంటివి కొరతగా ఉన్నవని మనసున్న దాతలు ముందుకు రావాలని ఈ కార్యక్రమాన్ని ఇంతట దిగ్విజయంగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజున అన్నదానాలు, చెక్కభజనలు తదితర కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని భక్తాదులందరూ పాల్గొని ఆంజనేయుని కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ ధర్మకర్త మాదినేని రామచంద్రస్వామి తెలిపారు.
రాజుకుంట పంచాయతీలోని యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమ నిర్వహన లో ప్రధాన పాత్ర పోషించారు.కాగా ఈరోజు ఉదయం స్వామివారిని బిజెపి నాయకులు సాయి లోకేష్ , స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు.
Comments