రాచమల్లు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల భారీ ర్యాలీ.
వేల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న పొదుపు సంఘాల మహిళలు - నిరసన ర్యాలీ సక్సెస్
భేషరతుగా టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ మహిళలకు క్షేమాపణ చెప్పాలని డిమాండ్.
టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి నారాయణమ్మను ఆమె కుమార్తె లలితను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు.
ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత.
లోకేష్ ప్రవీణ్ రెడ్డిని పరామర్శించటంపై ఎమ్మెల్యే కామెంట్స్
శుక్రవారం చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి 24గంటల నిరాహారదీక్ష
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గత కొద్దీ రోజులుగా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన డ్వాక్రా మహిళా సంఘాల రుణాల అవినీతి టీడీపీకి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకోగా, ఒకానొక సందర్భంలో టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి ఇంటివద్దకు చేరుకున్న దాదాపు మూడు వందల మంది డ్వాక్రా మహిళలు, ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ నేతృత్వంలో సద్దుమణిగిన గొడవ. పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి ప్రవీణ్ రెడ్డిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు కడప సెంట్రల్ జైలుకు తరలింపు, పరామర్శించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.
కాగా గురువారం ఉదయం మునిసిపల్ కార్యాలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు గాంధీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు, వైసీపీ నాయకులు, సంఘీభావంగా వేలాదిగా ర్యాలీలో పాల్గొన్న డ్వాక్రా సంఘాల మహిళలు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ కదంతొక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మి నారాయణమ్మ, ఆమె కుమార్తె లలిత, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలలో అవినీతికి పాల్పడి దాదాపు ముప్పై రెండు లక్షల మేర నిధులు తమ స్వప్రయోజనాల కొరకు వాడుకొని, ఇరవై తొమ్మిది డ్వాక్రా మహిళా సంఘాల మహిళలకు మొండి చేయి చూపారని, ఇది గ్రహించిన సదరు డ్వాక్రా మహిళలు ఆర్.పీ గా వ్యవహరిస్తున్నా లక్ష్మి నారాయణమ్మ కుమార్తె లలిత ఇంటివద్దకు చేరుకొని తమకు న్యాయం చేయమని అడుగగా, రమాదేవి అనే మహిళను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని, ఇందుకుగాను పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.
ఇదిలా ఉండగా మరుసటిరోజు టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి లక్ష్మి నారాయణమ్మ, ఆమె కూతురు లలిత అవినీతికి పాల్పడలేదని, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను డబ్బులు చెల్లిస్తానని పిలుపునివ్వాగా, బాధిత మహిళలు ప్రవీణ్ ఇంటివద్దకు చేరుకొని తమకు న్యాయం చేయమని కొరటానికి వెళ్లగా, అసభ్యకరమైన పరుష పదజాలంతో మహిళలను దూషిస్తూ వారిపై దాడి చేశారని, అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాలకు చెందిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డిని కడప కారాగారం నందు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి సంఘటనలు ఖండించాల్సిన చంద్రబాబు, లోకేష్ ఇరువురు ప్రవీణ్ రెడ్డికి మద్దతుగా నిలవటం, స్వయానా లోకేష్ వచ్చి కడప కారాగారం నందు ప్రవీణ్ రెడ్డిని పరామర్శించి, తిరిగి ప్రొద్దుటూరు రావటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. లోకేష్ భేషరతుగా తన నియోజకవర్గ మహిళలకు క్షేమాపణ చెప్పాలని హెచ్చరించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి భాదితులకు తగు న్యాయం చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
డ్వాక్రా మహిళా సంఘాలకు మద్దతుగా తాను శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఇరవై నాలుగు గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి తెలిపారు. డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగే వరకు వైసీపీ మహిళా నాయకురాళ్లు దీక్షలు ధర్నాలు చేపడతారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మునిసిపల్ కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు, డ్వాక్రా మహిళలు, డ్వాక్రా మహిళలకు సంఘీభావం తెలిపిన వారి కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.
Comentários