వయోపరిమితి పెంచలి, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలి - డివైఎఫ్ ప్రొద్దుటూరు పట్టణ కమిటీ
డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జి డేవిడ్ రాజ్ పొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్ లో గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వం వదిలిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికషన్లు లో ఉద్యోగాల సంఖ్య పెంచాలని,వయోపరిమితి పెంచాలని,పరీక్ష సమయం గడువు ఇవ్వాలి. గత నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో ఇప్పుడు పీజీలు పీహెచ్డీలు డిగ్రీలు చదువుకొని ఎన్నో సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన వారు అనర్హులుగా మారారని కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని ఐదు సంవత్సరాలు పెంచాలని భారీగా సిలబస్ ఉన్నందువల్ల కనీసం మూడు నెలల గడువును ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఇవ్వాలని అలాగే మాట తప్పను మడవతిప్పనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 6700 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు కేవలం 6500 ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలకు గాను 20100 పోస్టులకు ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పరీక్ష గడువు పోస్టుల సంఖ్య ను పెంచాలి. అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారిందని తెలిపారు. తక్షణమే నిరుద్యోగుల కోరిక ప్రకారం ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని ప్రిలిమినరీ పరీక్ష గడువును పోస్టుల సంఖ్యను పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నరసింహ, సురేష్, ఓబులేసు, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.
Comentarios