బడ్జెట్ లో కడప ఉక్కును మరచిన కేంద్రం - డి.వై.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజ్
ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు ను విస్మరించడం దారుణం అని ప్రొద్దుటూరు తాసిల్దార్ కార్యాలయము నందు డి.వై.ఎఫ్.ఐ, ఎస్.ఎఫ్.ఐ పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజ్, ఎస్.ఎఫ్.ఐ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందని, అందులో ప్రధానంగా కడప ఉక్కు పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నది అన్నారు. గడిచిన ప్రతి పార్లమెంటు సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో కడప ఉక్కు కు నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసారని, వారికి ప్రతి సారి నిరాశే ఎదురు అవుతుందని అన్నారు. కడప ఉక్కుకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా, నిధులు కేటాయిస్తారా లేరా అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలసలు పోతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కేంద్రంపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి కానీ ఉక్కు పై మాట్లాడటం లేదు అన్నారు. కడప ఉక్కు పై కేంద్రంతో పోరాడాలని అన్నారు. కడప ఉక్కు కు నిధులు కేటాయించాలని లేని పక్షంలో పోరాటాలు సాగిస్తామని, ఈ పోరాటంలో యువత, విద్యార్థులు కలసి రావాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డి.వై.ఎఫ్.ఐ, ఎస్.ఎఫ్.ఐ నాయకులు సురేశ్ నాయక్, అజయ్, రాహుల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments