top of page
Writer's picturePRASANNA ANDHRA

గ్రహణ సమయం ఆలయ వేళలు

ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతోపాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది.

➡️ యాదాద్రి ఆలయాన్ని ఇవాళ ఉదయం 8:50 నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. నేడు జరిగే నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు నిర్వహించాల్సిన శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.

➡️ ఏడుపాయల శ్రీ వన దుర్గాభవానీ మాత ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. నేడు ఉదయం 8:50 నిమిషాలకు మూసివేయనున్నారు. తిరిగి రేపు ఉదయం 9:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.


➡️ భద్రాద్రి రామాలయాన్ని ఇవాళ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు.


➡️ వేములవాడలో రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సుప్రభాత సేవ తర్వాత రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.


➡️ జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం తిరుమంజనం నిర్వహించి, భక్తులకు సర్వ దర్శనానికి అనుమతిస్తారు.


➡️ ధర్మపురి ఆలయాన్ని నిత్యారాధన, నివేదన అనంతరం మూసివేయనున్నారు.


➡️ అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు.


➡️ వరంగల్‌లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో వేయి స్తంభాల గుడిని ఉదయం 9 గంటలకే మూసివేయనున్నారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.


➡️ తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.


➡️ ఇవాళ ఉదయం 11 గంటలకు కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని తెరవనున్నారు. రేపు ఆలయంలో అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.


➡️ విశాఖ సింహాచలం, శ్రీకాకుళం అరసవల్లి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.

16 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page