విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : భానుమూర్తి రాజు
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వ్యాయామ విద్య రాష్ట్ర ఇన్చార్జి భాను మూర్తి రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ఎస్ రోడ్డులో గల శ్రీ చైతన్య పాఠశాలలో ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ విద్యార్థులకు పలు క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భానుమూర్తి రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సర్వతో ముఖాభివృద్ధి చెందుతారని అన్నారు. క్రీడల వలన ఆరోగ్యంతో పాటు దేహదారుఢ్యం, మానసిక వికాసం లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, క్రీడాకారులను ప్రోత్సహించడానికి విద్యా, ఉద్యోగాలలో కోటా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను క్రీడలలో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్ ఇన్చార్జి శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్చార్జి కస్తూరి, ఉపాధ్యాయినీ-ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments