కడప జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక వై.ఎం.ఆర్ కాలనీ లోని ప్రొద్దుటూరు ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నందు నేడు ఎలెక్ట్రీషియన్స్ డే సందర్బంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న నియోజకవర్గ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబెర్ టంగుటూరి మారుతీ ప్రసాద్, ఈ సందర్భంగా సర్ థామస్ ఆల్వా ఎడిషన్ ఎలక్ట్రానిక్ బల్బు కనుగొన్న తేదీని ని ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ డే గా ప్రభుత్వం గుర్తించాలని, ప్రభుత్వం తరఫున భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చేటువంటి సదుపాయాలు సౌకర్యాలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవ్వడం లేదు కావున వాటిని త్వరగా మంజూరు చేయవలసిందిగా అసోసియేషన్ తరపున స్థానిక పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ని కోరటం జరిగింది, అలాగే అసోసియేషన్ కొరకు రెండు సెంట్లు స్థలం కేటాయించడం జరిగింది అని ఆ స్థలంలో పొద్దుటూరు ఎలక్ట్రికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నూతన భవన నిర్మాణం చేపడతామని MLA చెప్పటం సంతోషించదగ్గ విషయం అని వారు కొనియాడారు, ప్రొద్దుటూరు ఎలక్ట్రికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరి కమల్ భాషా సెక్రెటరీ మదన గోపాలుడు, ట్రెజరర్ నారాయణ పాలకవర్గం సభ్యులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీటీడీ సభ్యుడు టంగుటూరు మారుతి ప్రసాద్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమము ర్యాలీగా ప్రారంభమై గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మార్వో కు మెమొరాండం ఇవ్వడం జరిగింది.
top of page
bottom of page
Comments