ఈ రోజు ఉదయం కడప జిల్లా చిట్వేల్ మండలం సిపిఐ కార్యాలయం నందు సిపిఐ బాధ్యులు సమావేశం ఏర్పాటు చేసి...ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ
అసలే కరోనా కష్టాలు..ఇంటి పన్ను, చెత్త పన్నుల పెంపుదలతో ప్రజానీకం సతమతమవుతున్నారనని తాజాగా
ఇప్పుడు విద్యుత్ చార్జీలను భారీగా పెంచి జగన్ సర్కార్ షాక్ ఇవ్వటం దుర్మార్గమన్నారు.
కేటగిరీలను రద్దుచేసి, 13 స్లాబ్ లను 6 స్లాబ్ లకు కుదించి, కరెంట్ చార్జీలను విపరీతంగా పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలపై విద్యుత్ ఛార్జీల గుదిబండ మోపడం అన్యాయమనని
రాష్ట్ర ప్రభుత్వం పదేపదే పన్నులు,విద్యుత్ ధరల భారాలను ప్రజలపై మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేశారు.
జనానికి జగనన్న విద్యుత్ ధరలు పెంచి కరెంట్ షాకులు ఇచ్చారన్నారు.
యూనిట్ కు 45 పెసల నుంచి 1.57 వరకు పెంచి పేద మధ్య తరగతి వర్గ ప్రజలపై భారీ వడ్డన చేశారన్నారు.
30 యూనిట్ల లోపు 1.90 పైసలు 75 నుంచి 125 యూనిట్ల వరకు 4.50 పైసలు ఇలా అన్ని క్యాటగిరిలో చార్జీలు పెంచారన్నారు. ప్రతి పక్షంలో చంద్రబాబు పై విమర్శలు చేసిన ఈ పెద్ద మనిషి మూడేళ్ళలో 7 సార్లు శ్లాబులు కుదించి జనంపై భారం వేస్తూ పేద మధ్య తరగతి ప్రజలపై భారం మోపడం దుర్మార్గమన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొరముట్ల నరసింహులు పాల్గొన్నారు.
コメント