జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు,
ఈక్రాప్ నమోదు నాలుగు రోజులలో పూర్తి చేయాలి. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు
ఏలూరు, భీమడోలు, పంట నమోదు కార్యక్రమాన్ని ( ఈ క్రాప్ ) రానున్న నాలుగు రోజులలో నూరు శాతం పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ పి అరుణ బాబు ఆదేశించారు.
బుధవారం భీమడోలు మండలం పాతూరు, గుండుగొలను గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, అసిస్టెంట్ కలెక్టర్, ఇంఛార్జి ఆర్డీవో టి .రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించి పాతూరు రైతు భరోసా కేంద్రం, అంగన్వాడి కేంద్రం, గుండుగొలనులో ఇళ్ల లేఔట్లను పరిశీలించడంతో పాటు భీమడోలు తహసిల్దర్, ఎంపిడిఒ కార్యాలయాలను సందర్శించారు.
మండలంలో ఈ క్రాప్ నమోదు పక్రియను పరిశీలిస్తూ రానున్న నాలుగు రోజులలో ఈ పక్రీయను పూర్తి చేయాలని ఆదేశించారు.
పాతూరు లోని రైతు భరోసా కేంద్రం సందర్శించి ధాన్యం కొనుగోలు, అర్బికె ద్వారా రైతులకు అందిస్తున్న సేవల వివరాలను ఆయన తెలుసుకుని సంబంధిత రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంభందించిన మద్దతుధరల గ్రేడ్ వారి రేటులను నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించార లేదా పరిశీలన చేశారు. గుండుగొలను లో హౌసింగ్ ల
Opmerkingen