top of page
Writer's pictureEDITOR

డిమాండ్లు నెరవేర్చాలి - ఎంప్లాయిస్ యూనియన్

డిమాండ్లు నెరవేర్చాలి - ఎంప్లాయిస్ యూనియన్

రాజంపేట, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి బి.సి శేఖర్ పేర్కొన్నారు. ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రకమిటి పిలుపు మేరకు మంగళవారం డిపోలో డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఉదయం నుండి డ్యూటిలకు వెళ్లే ఉద్యోగులందరూ ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.

ఈ సందర్బంగా డిపో కార్యదర్శి బి.సి శేఖర్ మాట్లాడుతూ మూడునెలలుగా ఆర్టీసి ఉద్యోగులకు పెండింగు పెట్టిన ఓటి లు, నైట్/డేఔట్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని అన్నారు. ఓటి, నైట్ /డేఔట్ అలవెన్సులు మూడునెలలు అరియర్సుతోపాటు వెంటనే చెల్లించాలని, డిసెంబర్ నెల నుండి ప్రతినెలా జీతంతోపాటే ఓటి మరియు ఇతర అలవెన్సులు చెల్లించేలా చర్యలుతీసుకోవాలని.. సిక్కులు చేసిన వారికి మెడికిల్ లీవ్ మంజూర్ చేసి పెండింగు పెట్టిన జీతాలు చెల్లించాలని తెలిపారు.


కొత్త పి.ఆర్.సి నిబంధనల మేరకు ఒకే పోస్టులో 6, 12, 18, 24, 30 సం.లు., సర్వీసు పూర్తిచేసిన అన్నికేటగిరుల సిబ్బందికి ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీమ్ ( ఏ.ఏ.యస్) లు రెగ్యులేషన్-30 లో ఉన్నవారితో అందరికీ కలపాలని, విలీనం అనంతరం పదోన్నతలు/గ్రేడ్ వన్స్ ప్రమోషన్లు ఇచ్చిన 2096 మంది ఉద్యోగులకు వెంటనే 11 వ పిఆర్శీసి అమలు చేయాలని.. ఆపరేషన్ మరియు నాన్-ఆఫరేషన్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన మంత్లీ ఇన్సెంటివ్ ను బకాయిలతోపాటు చెల్లించి, ఏ నెలకు ఆనెల ఇన్సెంటివ్ చెల్లించేలా చూడాలని, పిటిడి ఉద్యోగులకు 2020-21, 2021-22 సం.లకు పెండింగ్ లో వున్న లీవ్ ఎన్ క్యాష్ మేంట్ ను చెల్లించాలని, ఓటి డ్యూటిలకు మంత్లీ చెల్లించేందుకు ఇబ్బందులు ఉంటే ఏరోజుకు ఆరోజే ఓటి డబ్బులు చెల్లించాలని అన్నారు. ఓటి డ్యూటి లకు ఒటి క్లయిమ్స్ చెల్లించే ఇబ్బందులు ఉంటే ఓటి డ్యూటిలను అన్నింటిని 8 గంటలు లేదా స్పెషల్ ఆఫ్ డ్యూటిలుగా మార్పుచేయాలని, డీపీటీఓ ల వ్యవస్త ఏర్పడినతరువాత అప్పీల్స్/బదిలీలు పెండింగులో ఉన్నందున డెలిగేషన్ ఫవర్సు వెంటనే మంజూరు చేసి ఈసమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీలో రెగ్యులేషన్-30 లో పదోన్నతులు పొంది విధులు నిర్వర్తిస్తున్న అన్ని క్యాటగిరిల సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గేట్ మిటింగు నిర్వహించామని, తదుపరి రాష్ట్రకమిటి పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు నరసారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, గ్యారేజ్ కార్యదర్శి సుధాకర్, చలపతి, బాబు, మౌలా, చంద్ర, కృష్ణ, ఖాదరయ్య, మల్లయ్య, వల్లి, భాస్కర్ రాజు, సుబ్బయ్య, బలరాం, పార్వతి, సులోచన, ఉమాదేవి, దేవి, మోహన్, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

9 views0 comments

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page