'జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి ఫుడ్డూ డేంజరే'
ఇంట్లో వండుకునే ఆహారమైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో తెలిపింది. కొవ్వు, చక్కెర, ఉప్పు, నూనె అధికంగా ఉంటే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించింది. రోజుకు ఉప్పు 5 గ్రాములు, చక్కెర 25 గ్రాములు మించరాదని స్పష్టం చేసింది. విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్నే ప్రజలు ప్రాధాన్యంగా తీసుకోవాలని పేర్కొంది.
Comments