కంటి వ్యాధులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి : కృష్ణ తేజ ఐ హాస్పిటల్, కంటి వైద్యుడు యం.ఎస్.తేజ
కంటి వ్యాధులపై ప్రతిఒక్కరూ అవ గాహన కలిగి ఉండాలని కృష్ణ తేజ ఐ హాస్పిటల్ కంటి వైద్యుడు యం.ఎస్.తేజ అన్నారు. జనవిజ్ఞాన వేదిక సమ్మర్ క్యాంపు లో భాగంగా సెక్రటేరియట్ సభ్యులు రాజేష్ ఆధ్వర్యంలో పిల్లలకు ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించారు.
కంటి డాక్టర్ తేజ మాట్లాడుతూ అంధత్వానికి గల కారణాలు, దృష్టి లోపాలపై అవగాహన కల్పించారు. కండ్లకలక వైరస్ వల్ల కలిగే వ్యాధి అన్నారు. కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు గుచ్చుకోవటం లక్షణాలుగా గుర్తించాలన్నారు. వ్యక్తిగత పరిశు భ్రత పాటించాలని సూచించారు. ప్రజలకు అంధత్వ కారణాలు, దృష్టి లోపాల గురించి అవగాహన కల్పించి తద్వారా సకాలంలో కంటి వైద్యం అందించుట ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చన్నారు.
రోజంతా మనకు తెలియకుండానే అత్యధిక సమయం మొబైల్స్, ల్యాప్ ట్యాప్ స్క్ర్కీన్ చూస్తూనే గడిపేస్తున్నాం. దీంతో కళ్లపై చాలా ప్రభావం పడుతోంది. కావున కళ్లకు శక్తినిచ్చే విటమిన్ A, C, E, జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలకూర, క్యాబేజీ, బీట్రూట్, చేపలు, విత్తనాలు, బీన్స్, గింజలు. గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను డైట్ లో చేర్చాలి. అవసరమైతే కళ్లజోడు ధరించాలి.ప్రతిరోజు విద్యార్థులు 8గంటలు నిద్ర పోవాలి. అంధత్వానికి కారణాలు సవరించబడిన దృష్టి లోపాలు (Un corrected Refractive Errors)- కంటి పరీక్షలు చేయించుకొని అద్దాలు వాడడం వలన నివారించ వచ్చును. కాబట్టి సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్ తో కంటి పరీక్షలు చేయించు కోవడం వలన అంధత్వంను నివారించవచ్చు అని కంటి డాక్టర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, జిల్లా ఆరోగ్య విభాగం కన్వీనర్ డా. చక్రధర్, ప్రధాన కార్యదర్శి సునీత, సమ్మర్ క్యాంప్ కో ఆర్డినేటర్స్ చరణ్, గురప్ప, అజర్, అక్షయ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments