విశాఖ ఉక్కులో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందని మాట్లాడి ఉద్యోగం కోల్పోయిన పట్టా రామ అప్పారావు ను పరామర్శించిన మాజీ ఎం ఎల్ ఏ చింతలపూడి వెంకట్రామయ్యా.
ఆగనంపూడి ఆర్ హేచ్ సి కొండయ్యవలస గ్రామంలో ఉక్కు కార్మిక నాయకుడు ,నిర్వాసితుడు అయిన పట్టా రామ అప్పారావుని ఉక్కు యాజమాన్యం విధులనుంచి తొలగించి నేటికి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా న్యాయ పోరాటం చేస్తున్న పట్టా రామ అప్పారావు విజయం సాధించాలి అని చింతలపూడి వెంకట్రామయ్య ఆశీర్వదించి మనోధైర్యం కలిపించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కరంగారం కొరకు రామ అప్పారావు 33 సంవత్సరాలు సర్వీసు చేసి ,ప్రవృత్తిగా సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేసి అనేక ప్రశంసలు పొందారు.ఆయన ఉక్కు నిర్వాసితులకు,స్థానిక పేదలకు,జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడారు .ఉక్కు యాజమాన్యం లో కొంతమంది కి వారి మనోభావాలు దెబ్బతింటే మరోసారి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పవలసింది పోయి ఉద్యోగం తీసేయడం బాధాకరమని అన్నారు. ఇంకా మూడు నెలలే సర్వీసు ఉంది కనుక ఉక్కు యాజమాన్యం పట్టాను సర్వీసులోకి తీసుకుని ఉపశమనం కలిగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ డి సి ఛైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, ఉక్కు స్టోర్స్ మాజీ అధ్యక్షుడు కాసా పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments