వరదకు టిడిపి టికెట్ ఇస్తే సహకరించం - మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ముక్తియార్
ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు కొండా రెడ్డి అని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి, అసలు వీరు టిడిపి పార్టీ లోనే లేరని అలాంటిది వారికే టికెట్ అని ప్రచారం సాగించటం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. వారికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు? గతంలో వరద పై తాను 30 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచానని, అలాగే గతంలో 2 సార్లు కాంగ్రెస్ ఒక మారు వైసీపీ టికెట్ తనకు ఇస్తామన్నా తాను టీడీపీ నే నమ్ముకొని ఉన్నానని అన్నారు. 2014 లో వరదకు కేటాయించిన అధికార పార్టీ ఇంచార్జి పదవిని దుర్వినియోగం చేశారన్నారు, జగన్ అమ్మగారు, సోదరిని, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మెంబర్ గా వరద ఉన్నారని, ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఏమి చేసారని దుయ్యబట్టారు. టిడిపి అధికారంలోకి వస్తుంది అని నేడు టీడీపీ జెండా వరద బుజాన వేసుకున్నారని అనారు. ఏ పార్టీ అధికారంలో వుంటే వరద ఆ పార్టీ జెండా భుజాన వేసుకుంటారు అని ఏడ్డేవా చేశారు. ఇదే వరద 2014లో టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా సహకరిస్తానని చెప్పి నేడు తనకు లేదా తన కుమారునికి టికెట్ అని చెప్పటం ఏమిటి అని అన్నారు. వరద టీడీపీ పార్టీ లో చేరినా తాను సహించను అని హెచ్చరించారు. వరద ఆయన కుమారుడు టీడీపీ తహరుపున పోటీ చేస్తే వైసీపీ 70 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుంది అని అభిప్రాయపడ్డారు. వరదకు కానీ ఆయన కుమారుడు కొండా రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము నక్సలైట్లు లేదా సన్యాసం స్వీకరించి తదనుగుణంగా నడుచుకుంటానని ఇది తప్ప తమకు వేరే మార్గం లేదని అన్నారు. బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి వరద వెంట నాయకులు నడవటాన్ని తప్పు పట్టారు. ఇన్ని రోజులు ప్రభుత్వ అధికారులు చేస్తున్న అవినీతి వరదకు కనిపించలేదా అంటూ, అధికారులు వారి కుటుంబాలను టీడీపీ కి దూరం చేశారని, వరదను పార్టీలోకి రానివ్వబోమని ఆయన గట్టిగా హెచ్చరించారు.
రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి ముక్తియార్ మాట్లాడుతూ, వరద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గతంలో తాము లోకేష్ సంక్షంలో టీడీపీలో చేరితే అందుకు వరద అడ్డగించారు అని, వైసీపీ తో కుమ్మక్కు అయి ఆయన పనులు చేసుకున్నారన్నారు. టిడిపి పార్టీ ఆలోచన చేసి టికెట్ ఖరారు చేయాలని, ముందు నుండి మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి టిడిపి లో సరైన గౌరవం దక్కకున్నా పార్టీ నే నమ్ముకొని పని చేశారని కావున లింగా రెడ్డి కే టికెట్ ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
ఈవీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వరద గతంలో అన్ని పార్టీ లకు దూరంగా ఉన్నాను అని చెప్పి అధికార పార్టీ తో కుమ్మక్కు ఆయి పనులు జరిపించుకొని, కనీసం పార్టీ సభ్యత్వం కూడా రెన్యువల్ చేసుకోలేదు అని అన్నారు. గడచిన దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన వారికే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments