ప్రజా తీర్పును గౌరవిస్తున్న - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రజా తీర్పును గౌరవిస్తూ, రాజకీయాలలో గెలుపోటములు సర్వసాధారణమని అందుకు తాను ఓటర్లను నిందించటం తగదని, తన సమీప ప్రత్యర్థి ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి గెలుపునకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఎన్నికలు నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన హామీలు అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు, రానున్న ఐదు సంవత్సరాలలో టిడిపి చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయన అన్నారు. ఇకపోతే ఒక సంవత్సరం పాటు తను టిడిపి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడి టిడిపి నాయకులను కానీ విమర్శించను అని, అనంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తానన్నారు?
తనకు ఓట్లు వేసిన 83 వేల మంది ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన దశాబ్ద కాలంలో ఇక్కడి వ్యాపారస్తులకు ఉద్యోగులకు సహకరిస్తూ వారిని గౌరవించానని ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ శాంతిభద్రతలు కాపాడాల్సిన ఆవశ్యకత పోలీసులకు ఎంతైనా ఉందని గుర్తు చేశారు. రానున్న రోజులలో పార్టీకి బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, నాలుగో వర్డ్ కౌన్సిలర్ వరుకుటి ఓబుల్ రెడ్డి, సానపు రెడ్డి ప్రతాపరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments