మతం అన్నది ఒక నమ్మకం, జాతి వలన దైవాన్ని అపవిత్రం చేయరాదు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
టీటీడీ లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు పాపప్రక్షాళన అంటూ వైఎస్సార్సీపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూజలు నిర్వహించిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం అబద్దాలు చెప్పటం, ఇచ్చిన మాట తప్పడం, అధికారం కోసం అడ్డదారుల తొక్కుతూ నేడు సాక్షాత్తు కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతు మాంస నిక్షేపాలు ఉన్నాయని ప్రజలను నమ్మిస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నాణ్యతకు భంగం కలిగిందని బాబు విమర్శించడం సబబు కాదని ఆయన అన్నారు. ఆవు నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు లోపించటానికి ముఖ్య కారణం దాణా నందు మార్పులు జరగటం వలన సంభవించి ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడుతూ, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవడంపై అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ? ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరాచక ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ పాపప్రక్షాళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగా, ఇందులో భాగంగానే తాము కూడా ప్రొద్దుటూరులో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments